గుత్తి పట్టణంలోని 7వ వార్డు ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువకుడు మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన మల్లేష్ కుమారుడు కాశీం (30) అనే యువకుడు పట్టణం లోని అమృత్ టాకీస్ ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్స్ షాప్ లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కాశీంకు ఈ ఏడాది మార్చి 23, 24వ తేదీల్లో వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో అతడు ఇంటిలో పైకప్పుకు ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐతే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.