యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం సెజ్ పరిధి ఒక పరిశ్రమలో మధ్యాహ్నం జరిగిన దుర్ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే కన్నబాబురాజు ఆరా తీశారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు గాయపడటంతో కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున పొగలు, మంటలు వ్యాపించడంతో కార్మికులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. సంఘటనపై నాయకులు, అధికారులు ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే కన్నబాబు రాజు అధికారులను ఆదేశించారు.