సిటిజన్ ఔట్ రీచ్ సర్వేను వలంటీర్లు సక్రమంగా చేయాలని పుల్లలచేరువు ఎంపీడీఓ రాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వలంటీర్లు సర్వేను అశ్రద్ధ చేస్తున్నారని, పని చేయడం ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. తమ పరిధిలోని అర్హులకు ప్రభుత్వ పథకాల సమాచారం తెలియజేయాలని వలంటీర్లకు సూచించారు. కొందరు వలంటీర్లపై ఫిర్యాదులు వస్తున్నాయని, సక్రమంగా పనిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వలంటీర్ల పనితీరుపై నివేదిక ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఆదేశించారు.