రెండు రోజుల కిందట ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో గల్లంతైన టెన్త్ విద్యార్థి కొమ్మోజు రేవంత్(15) మృతదేహం మంగళవారం లభించింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం వేమవరం తీరంలో మంగళవారం ఉదయం మృతదేహం కొట్టుకు రావడంతో మత్స్యకారులు మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం నర్సీపట్నం అయ్యన్న కాలనీకి చెందిన కొమ్మోజు రేవంత్ గా పోలీసులు నిర్ధారించారు. రేవంత్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.