ధూమపానం ఆరోగ్యానికి హానీకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు మానటం లేదు. అయితే ఎక్కువగా సిగరెట్లు కాల్చేవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రాణాంతక సమస్యలకు కూడా ప్రధాన కారణంగా నిలుస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ, రక్త ప్రసరణ, చర్మం, కంటి సంబంధిత సమస్యలు వేధిస్తాయి. ధూమపానం శరీరంలో రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు.