బ్రహ్మంగారిమఠం మండలం అధిక శాతం నేరాలలో ఉందని, మద్యం సేవిస్తే యువత తప్పుడు మార్గాలతో నడుస్తున్నారని మైదుకూరు రూలర్ సిఐ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని స్థానిక ఐదు రోడ్లు కూడలిలో స్థానిక సర్పంచ్ రామయ్యతో కలిసి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ. జిల్లాలోని అధికంగా బ్రహ్మంగారిమఠం నేరాలలో ఉందని మద్యం సేవిస్తే యువత తప్పుడు మార్గాలతో నడుస్తున్నారని, మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు యువత గురవుతున్నారని అన్నారు. చిన్నపిల్లలు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని, గ్రామాలలో కొత్త వ్యక్తులు సంచరిస్తే అనుమానం వచ్చిన వెంటనే పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు కూడా అక్కడక్కడ అందుబాటులో ఉంటాయని నేరస్తులు పోలీసుల నుండి తప్పించు కోలేరని అన్నారు. ఒక్కసారి పోలీస్ రికార్డులో నమోదు అయితే వారిపై నిఘ ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మూర్తి, సిబ్బంది మాధవరెడ్డి, ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు.