రిటైర్ట్ ప్రొఫెసర్ దంపతులను దుండగులు దారుణంగా హతమార్చిన ఘటన బీహార్ నవాడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కటిరాలో సోమవారం జరిగింది. ప్రొఫెసర్ మహేంద్ర సింగ్ (70) వర్శిటీ డీన్ గా, ఆయన భార్య పుష్పసింగ్ (65) మహిళా కాలేజీలో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారు. వీరి కుమార్తె ఫోన్ చేయగా స్పందన లేకపోవడంతో ఆమె స్నేహితులు వచ్చి చూడగా జంటహత్యల విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.