రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కతం కానుంది. 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన గ్రీన్ కొమెట్ తోక చుక్క మళ్లీ కనువిందు చేయనుంది. ఫిబ్రవరి 2 - 6 వరకు ప్రజలు దీన్ని వీక్షించవచ్చు. ఇక విజయవాడ వాసులు దీన్ని మరీ స్పష్టంగా చూడవచ్చట. చీకట్లో ఆకుపచ్చ రంగు వెలుగులు విరజిమ్మే ఈ మంచుగోళం, తిరిగి 50వేల ఏళ్ల తర్వాతే కనిపిస్తుందట. ఇది సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు ధూళిని, వాయువులను వెదజల్లుతూ తోకచుక్కల్లా కనిపిస్తాయి.