ముంబైలోని బొరివ్లీ ఏరియా రాంబాగ్ లేన్ కు చెందిన దంపతుల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్య విడాకులు కోరగా భర్త నిరాకరించాడు. ఈ క్రమంలో ఇష్టం లేకపోయినా వారు ఒకే ఇంట్లో ఉంటూ అన్నింటినీ షేర్ చేసుకుంటున్నారు. ఈ నెల 28న రాత్రి భర్త, భార్యను తాను రెస్ట్ తీసుకోవాలని బెడ్ కావాలని కోరాడు. అమె నిరాకరించగా చెంపపై కొట్టడంతో వినికిడి కోల్పోయింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా భర్తపై కేసు నమోదైంది.