సీఎం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని మంత్రి జోగి రమేశ్ స్పష్టంచేశారు. బురద చల్లడమే విపక్షాల పని అని మండిపడ్డారు. సీబీఐ కేసుకు, విశాఖ రాజధానికి ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ అని వెల్లడించారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని జోగి రమేశ్ తెలిపారు. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందని అన్నారు.
ఇదిలావుంటే సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలో విశాఖ ఏపీ రాజధాని అవుతోందని, తాను మరికొన్ని నెలల్లో విశాఖ షిఫ్ట్ అవుతున్నానని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. అయితే ప్రతిపక్ష నేతల విమర్శలపై మంత్రి జోగి రమేశ్ స్పందించారు.