కాలినడకన మార్గమును ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఏసీపి ఐ. వి రమణమూర్తి అన్నారు. నగరపాలక సంస్థ జోనల్ -5, టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో ఫుట్ పాత్ ఆక్రమణలపై అవగాహన ర్యాలీ కంచరపాలెం నుండి ఊర్వశి జంక్షన్ వరకు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఫుట్ పాతులుపై బడ్డీలు, అస్తవ్యస్తంగా వాహనాల పార్కింగ్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో టిపిఓ ఎం. శ్రీలక్ష్మి , కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.