రాంబిల్లి నవీన్ బేస్ వద్ద ఉదృతంగా మారుతున్న 94 వ రోజు ధర్నా. ఈ ధర్నాలో అన్ని గ్రామాల ప్రజలు ఆసనం వ్యక్తం చేస్తున్నారు. జేఏసీ నాయకులు 8గ్రామాల ప్రజలు అందరూ ధర్నా చేస్తున్నప్పుడు పది రోజులు తర్వాత అధికారులు వచ్చి మీ సమస్యలను పరిష్కారం చేస్తాము మీరు చర్చిలకు రండి అని పిలిచారు. తర్వాత జేఏసీ నాయకులు అందరూ కూడా కలిసి మాట్లాడుకుని చర్చిలకు వెళ్తే మనకు న్యాయం జరుగుతుందని ఆలోచించి చర్చిలకు వెళ్లారు కానీ ఎటువంటి న్యాయము జరగలేదని జేఏసీ నాయకులు తెలియజేశారు. మాకు న్యాయం జరిగేంతవరకు ధర్నా తీసేది లేదని తిరిగి తిరిగి అలసిపోయామని అసహనం వ్యక్తపరుస్తూ ధర్నాన్ని కొనసాగిస్తున్నారు. మా ప్రాణాలు పోయినా ధర్నా తీయుము మాకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటము ఆగదు పోరాటం ఇలాగే కొనసాగుతాది అని జేఏసీ నాయకులు గ్రామ ప్రజానీకం తెలియజేశారు.