ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారిని వేధింపులు తాళలేక హాస్టల్‌ను ఖాళీ చేసిన విద్యార్థినులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 03:42 PM

కర్నూలు ప్రాంతీయ శిక్షణా కేంద్రం ఫీమేల్‌లో ఓ అధికారిని వేధింపులు తాళలేక 30 మంది మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ విద్యార్థినులు మంగళవారం హాస్టల్‌ను ఖాళీ చేశారు. గతంలో ఆ అధికారిని వేధింపులు భరించలేక ఇద్దరు విద్యార్థినులు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్ల శిక్షణ నిలిచిపోయింది. ఈ విషయంపై ట్రైనింగ్‌ ప్రిన్సిపాల్‌ విజయ సుశీలను వివరణ కోరగా.. తాము ఎవరినీ వేధించలేదని, పరీక్షల కోసం వారం రోజులు సెలవు ప్రకటించామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com