ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని అభాసుపాలు చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు.
మోపిదేవి మండల పరిధిలోని నాగాయతిప్ప గ్రామంలో బుధవారం ఉదయం సింహాద్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ బాబు గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ఆ కుటుంబాలు పొందిన లబ్ధిని వివరించడంతోపాటు సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులతో వెనువెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
పంచాయితీ కార్యదర్శి కమ్మిలి త్రిపుర సుందరి ఆధ్వర్యంలో పిఎసిఎస్ చైర్ పర్సన్ గరికిపాటి గోవిందరాజులు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ గరికిపాటి వెంకటేశ్వరరావు, మండల గ్రామ సచివాలయాల కన్వీనర్ కోసూరు శివనాగమల్లేశ్వర రావు, మోపిదేవి లంక సర్పంచ్ మోర్ల జ్యోత్స్న, పాల కేంద్రం అధ్యక్షులు పుప్పాల సతీష్ బాబు, పి. యం. సి చైర్మన్ గరికిపాటి సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావు, లింగం జగదీష్ కుమార్, మండల బిసి సెల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు, సచివాలయ కన్వీనర్ లు తాతా శ్రీకాంత్, విశ్వనాధపల్లి మణికంఠ సాయి లతో పాటు మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పింఛను లబ్ధిదారులకు సింహాద్రి రమేష్ బాబు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు కడవకొల్లు నరసింహారావుల చేతుల మీదగా నగదును పంపిణీ చేశారు. గ్రామంలోని భారత రాజ్యాంగం నిర్మాత బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి రమేష్ బాబు, నరసింహరావులు పూల మాలలతో నివాళులర్పించారు.