మహారాష్ట్ర నాసిక్ లో అమానవీయ ఘటన జరిగింది. శివ్రే గ్రామానికి చెందిన మహిళ పుట్టింటికి వెళ్లగా ఆమె భర్త ఒకరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆమె తన భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేయగా భర్త కుటుంబ సభ్యులు దాడి చేశారు. గ్రామస్థులు సైతం బాధితురాలి ముఖానికి మసి పూసి, మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. జనవరి 30న ఈ ఘటన జరగ్గా, పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.