ఆర్థిక మాంద్యం భయంతో టెక్ కంపెనీలన్నీ భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే నగదు లావాదేవీలు, చెల్లింపులు జరిపే అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ పేపాల్ 2000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పేపాల్ హోల్డింగ్స్ ఇంక్ త్రైమాసికంలో స్థూల ఆర్థిక మందగమనం కారణంగా ఈ చర్య చేపట్టినట్లు పేపాల్ సీఈఓ డాన్ షుల్మాన్ ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపు ప్రభావం సంస్థలో 7 శాతం మంది ఉద్యోగులపై ఉంటుందని తెలిపారు. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ అమలు అమలవుతుందన్నారు.