ఇవాళ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల స్వల్ప లాభంతో 59,708 వద్ద ముగియగా, నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 17,616 వద్ద స్థిరపడింది. ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, ఐటీసీ, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలు అర్జించాయి. నిపుణుల అంచనాలకు భిన్నంగా మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం చూపలేదు. ఒకానొక దశలో 1200కు పైగా పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, మళ్లీ నష్టాలు నమోదు చేసి చివరకు ఫ్లాట్ గా ముగిసింది.