ఉరవకొండ పట్టణంలో స్థానిక వెలుగు కార్యాలయం నందు మండల స్థాయి చైల్డ్ లైన్ అడ్వైజరీ బోర్డ్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ బ్రహ్మయ్య అధ్యక్షతన మండల స్థాయి బాల్యవివాహాల నిరోధక కమిటీ పునర్ సమీక్ష సమావేశమును చైల్డ్ లైన్ టీం మెంబర్ భాగ్యలక్ష్మి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాహసిల్దార్ బ్రహ్మయ్య మాట్లాడుతూ.. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్యవివాహాలను లేని మండలంగా ప్రకటించాలని దానికి ప్రతి ఒక్క అధికారి పౌరులు కృషి చేయాలని కోరారు. గ్రామీణ స్థాయి నుండి బాల్య వివాహాల నిర్ములన గ్రామీణ స్థాయి కమిటీల ద్వారా నివారించవచ్చని, బాల్యవివాహాల వలనే కలిగే అనర్ధాలు చాలా ఉన్నాయని, ముఖ్యంగా మాతృ మరణాలు, శిశు మరణాలు అధికం అవుతాయి అని, కావున తల్లిదండ్రులు బాలిక విద్య ప్రోత్సహించి బాల్యవివాహాలు చేయరాదని తెలిపారు. ఈ సమావేశంలో తహసిల్దార్ బ్రహ్మయ్య, ఐసీడీస్ సూపర్వైజర్ ఉమ రాణి, జిల్లా చైల్డ్ లైన్1098 కోఆర్డినేటర్, కృష్ణమాచారి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ బాలాజీ , టీం మెంబెర్ భాగ్యలక్ష్మి , విఆర్వోలు పంచాయతీ సెక్రెటరీలు , కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మహిళా పోలీసులు పాల్గొన్నారు.