చీరాలలోని సెయింటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్‌పీటిఇయల్ స్వయం వారిచే ప్రశంసాపత్రం పొందినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు బుధవారం తెలియజేశారు. స్వయం యన్. పి. టి. ఇ. యల్, మినిస్ట్రీ ఆఫ్ హుమస్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి వారిచే ఆన్ లైన్ సర్టిఫికేషన్ కోర్సులను నిర్వహిస్తుండగా అందులో ఇంజినీరింగ్ విద్యార్థులు రిజిస్టరై ఆధునిక టెక్నాలజి సంబధించిన కోర్సులను అభ్యసించవచ్చునని చెప్పారు.
యన్. పి. టి. ఇ. యల్ నిర్వహించిన పరీక్షలలో జులై 2022 నుండి డిసెంబర్ 2022 మధ్యకాలములో అత్యధిక విద్యార్థులు ఉత్తీర్ణులైనందుకు కళాశాలకు సర్టిఫికెట్ ఆఫ్ ఎప్రిసియేషన్ బహుకరించినట్లు కళాశాల ప్రధానాచార్యులు డా. మొయిద వేణుగోపాలరావు వివరించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి చెన్నైలో జరిగిన కార్యక్రమములో కళాశాల సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ డా. డి. వి. యన్. సుకన్య సర్టిఫికెట్ ఆఫ్ ఎప్రిసియేషన్ అందుకున్నట్లు తెలిపారు.