ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో ఏనుగులదిన్నెపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ బ్రోచర్లను పంపిణీ చేశారు. జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయని లబ్ధిదారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.