చీరాల మండలం ఈపూరుపాలెం ఎస్సై జనార్దన్ మంగళవారం రాత్రి పొద్దు పోయాక నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా 8 లీటర్ల నాటు సారా దొరికింది. ఐటిఐ కళాశాల సమీపంలో పోలీసు వాహనాన్ని చూసి ఓ వ్యక్తి తన చేతిలోని సంచిని రోడ్డు పక్కన విసిరేసి పరారయ్యాడు. ఆ సంచిని పరిశీలించగా అందులో నాలుగు బాటిళ్లలో ఎనిమిది లీటర్ల నాటు సారా ఉంది. దీంతో సారాను స్వాధీన పరుచుకొని కేసును నమోదు చేసిన ఎస్ఐ జనార్ధన్ తదుపరి దర్యాప్తులో వేటపాలెం మండలం రామాపురం కు చెందిన ఆనంద్ ను ముద్దాయిగా గుర్తించారు. ఈ సారాను అమ్మకానికి ఆనంద్ తీసుకువెళుతూ పోలీసులను చూసి వదిలేసి పరారయ్యాడని అతని కోసం గాలిస్తున్నామని ఎస్సై జనార్ధన్ బుధవారం సాయంత్రం మీడియాకు చెప్పారు.