కంభం మండలం కందులాపురం గ్రామ పంచాయతీలోని పశు ఆరోగ్య సేవ కేంద్రంలో డాక్టర్ వైస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ మొబైల్ వాహనాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ. ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మెహన్ రెడ్డి ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య సేవ మొబైల్ వాహనం ద్వారా పశుపోషకులు తమ పశువులను వ్యయ ప్రయాసలకు గురి కాకుండా నేరుగా తమ గ్రామాలకే వచ్చి చేకిత్సలు అందించడం జరుగుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అన్నా వాహనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పశు వైద్యాధికారులు, పశువైద్యశాల సిబ్బంది, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.