ఉరవకొండ పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో తోపుడు బండ్లు కార్మికుల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ.. తోపుడు బండ్లు కార్మికులపై ట్రాఫిక్ పోలీసులు వేధింపులు ఆపాలని, వారు వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు మంజూరు చేయాలని అలాగే వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని పేర్కొన్నారు. 60 సంవత్సరాల దాటిన వ్యాపారులకు మూడు వేల రూపాయల పింఛన్లు మంజు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి కరువై దుకాణాలకు అద్దెలు చెల్లించలేక అనేకమంది బండ్లు పై చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారని వీరిని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న వారందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు భద్రత కరువైందన్నారు, ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసి కేవలం నాలుగు లేబర్ కోడ్ లు ఏర్పాటు చేసి కార్మికుల హక్కులను కాల రాసిందన్నారు. దేశంలో లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి ఆదానీలాంటి కార్పొరేట్ చేతుల్లో పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆప్రజాస్వామికంగా కార్మిక చట్టాలను రద్దు చేస్తుంటే దీనిపై స్పందించాల్సిన రాష్ట్రంలోనే వైసిపి ప్రభుత్వం బిజెపి ప్రభుత్వానికి మద్దతుగా కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కనీస వేతన చట్టం అమలు చేస్తానని బోనస్, పిఎఫ్ ఈఎస్ఐ, గ్రాట్యూటీ సదుపాయాలు కల్పిస్తానని గొప్పలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకిచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్న వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాల అందరూ కూడా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు సుల్తాన్, తోపుడు బండ్లు యూనియన్ నాయకులు చక్రధర్, గంగాధర్, చెన్నరాయుడు, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.