అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ ఒక్క సభ కూడా నిర్వహించలేదని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను జగన్ కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని విమర్శించారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీలపై జగన్ ఒక్కరోజైనా కేంద్రాన్ని నిలదీశారా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలోనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు.