ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదేపదే తిడుతున్నాడని ఓనర్ ను చంపిన సెక్యూరిటీ

international |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 01:55 PM

తనను తిడుతున్నాడనే కోపంతో యజమానిని కత్తితో పొడిచి చంపాడు ఓ సెక్యూరిటీ గార్డ్. ఈ దారుణ ఘటన థాయిలాండ్ లో జరిగింది. సావత్ శ్రీరాట్ చలావ్ అనే వ్యక్తి అరోమ్ బన్నన్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే ఏదో విషయంపై సెక్యూరిటీ గార్డును బాస్ దుర్భాషలాడాడు. అలా అంతకుముందు చాలా సార్లు జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సావత్.. అరోమ్ పై కత్తితో దాడిచేశాడు. ఛాతీపై ఎడమవైపు కత్తిపోటుకు గురికావడంతో అతడు మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com