గుడ్లూరు మండలం చేవూరు చెరువు పొరంబోకు భూమిని స్వాధీనం చేసుకోవాలని హేతువాద సంఘ నాయకులు ఎన్ వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. రామదూత ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరి అదేశాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆరోపించారు. రామదూత అనే ఒక దొంగస్వామి ప్రభుత్వ భూములు ఆక్రమించి ఆశ్రమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న దొంగ స్వామిని అరెస్టు చేసి, ఆక్రమణ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.