గురువారం కదిరి పట్టణంలో రెవెన్యూ కాలనీ మరియు అడపాల వీధి 1 సచివాలయం, 4వ వార్డు పరిధిలోని వేమారెడ్డి సర్కిల్, ఫైర్ స్టేషన్, అడపాల వీధుల నందు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేకు ప్రజలు పూలమాలలతో, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గ్రామంలో గల ప్రతి గడపను సందర్శించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీధులలో గల సమస్యలను తెలుసుకొని అక్కడే గల ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కరించదగ్గ సమస్యలను పరిష్కరించారు. సత్వరమే పరిష్కారం కాని సమస్యలను పై అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించే విధంగా ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కు వచ్చిన కొన్ని సమస్యలు ఇంటి పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే ను కోరగా సంబంధిత విఆర్ఓ తో మాట్లాడి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు పంపిణీ చేయుటకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిమెంట్ కాంక్రీట్ రోడ్లు మరియు డ్రైన్ లు నిర్మించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ తో మాట్లాడి వాటికి సంబంధించిన ఎస్టిమేట్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఎలక్ట్రికల్ పోల్స్ వేయించాలని ఎమ్మెల్యే కి తెలుపుగా సంబంధిత ఇంజనీర్ తో మాట్లాడి అవసరమైనచోట ఎలక్ట్రికల్ పోల్స్ వేయాలని ఆదేశించారు. పొజిషన్ సర్టిఫికెట్స్ ఇప్పించాలని ఎమ్మెల్యే ని కోరగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తాము కాబట్టి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి పోజిషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని వీఆర్వో ను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వాటర్ ట్యాంక్ సచివాలయం పరిధిలో 4వ వార్డు కౌన్సిలర్ కృపాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమము, అభివృద్ధిని రెండిటిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నారు, గతంలో ఎన్నడూ కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవని తెలిపారు. అంతేకాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టాలని, వీటికి కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటున్నాయని తెలిపారు.
వీటన్నిటిని అధిగమించి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలి అంటే జగనన్నకు మనందరి సహకారం కావాలని, మనందరి సహకారంతో మరింత ముందుకు వెళ్లేందుకు వీలవుతుందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి పేదవాడు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో, అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు తన పాలనలో 50 శాతం పైచిలుకు రిజర్వేషన్లు కల్పించి, జగనన్న ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా పాలన సాగిస్తున్నారన్నారు. వారికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.