ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరగాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 01:38 PM

 వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కోరి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణలపై హోంమత్రి, డీజీపీ స్పందించాల్సి ఉండగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం ఏమిటని? విజయవాడలో మీడియా సమావేశంలో ప్రశ్నించారు. గతంలో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్‌ చేశారని, దీనిపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నామని ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలతో తమ వాదనకు బలం చేకూరిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com