చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం చాలా ముఖ్యం. ఆహారంలో కొద్ది మొత్తంలో కొవ్వు ఉంటే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. గింజలు, విత్తనాలు, అవకాడో, చేపల నుంచి లభించే కొవ్వులు ఆరోగ్యకరమైనవి. వీటి వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా ఉంటుంది. చర్మ క్యాన్సర్ పెరుగుదలను, వ్యాప్తిని నివారిస్తాయి. విటమిన్ 'ఏ', 'ఈ', 'సీ', జింక్,సెలీనియం ఉన్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. చర్మం హీల్ అవ్వాలంటే జింక్ ఎంతో ముఖ్యం.