మీటింగ్కు హాజరుకాని వలంటీర్లపై చర్యలు తీసుకుంటానని, దానికి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఎవరూ అడ్డుపడొద్దని మంత్రి రాజా హెచ్చరించారు. వలంటీర్లకు, కొత్తగా ఏర్పాటుచేసిన వైఎస్సార్ గృహసారథులతో గురువారం సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమావేశానికి విలేకర్లను కూడా అనుమతించలేదు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గృహసారథులంతా వలంటీర్లతో సమన్వయం చేసుకుని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే పార్టీ ఆదేశాల మేరకు చేపట్టిన సర్వే పత్రాల్లో ఉన్న ప్రశ్నలను క్షేత్రస్థాయిలో ప్రజలను అడిగి నింపాలన్నారు. సీఎం జగన్ ఉన్న స్టిక్కర్లను ప్రతి గృహానికి అంటించడంతోపాటు, మరో స్టిక్కర్ సెల్ఫోన్లకు కూడా అతికించాలన్నారు. వైసీపీ సోషల్ మీడియాను అందరూ ఉపయోగించుకోవాలని సెలవిచ్చారు.