గుజరాత్ డెయిరీ కో-ఆపరేటివ్ అమూల్ కీలక నిర్ణయం తీసుకుంది. లీటరు పాలపై రూ.3 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో దీంతో అమూల్ గోల్డ్ ధర లీటరుకు రూ.66, అమూల్ తాజా లీటరుకు రూ.54, అమూల్ ఆవుపాలు లీటరుకు రూ.56, అమూల్ ఎ2 గేదెపాలు లీటరుకు రూ.70గా ఉంటుందని అమూల్ తెలిపింది. మొత్తం నిర్వహణ వ్యయం, పాల ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ధరలు పెంచినట్లు తెలుస్తోంది. అమూల్ అక్టోబర్లో లీటరుకు రూ.2 పెంచింది.