ఏపీలోని విశాఖపట్నంకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరుకు ఓ నెంబరు నుంచి పార్ట్ టైమ్ జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చనే మెసేజ్ వచ్చింది. అతనిని నమ్మించేందుకు రూ.100ను అతని ఖాతాలో జమ చేసి పరిచయం పెంచుకున్నారు. తర్వాత వివిధ టాస్క్‌ల పేరిట అతన్ని మోసం చేసి రూ.8.82 లక్షలను కొల్లగొట్టారు. ఇంకా డబ్బులు పంపించాలని చెప్పటంతో తాను మోసపోయినట్లుగా గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు.