ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు ఎంపీపీగా కరణం పుష్పావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మూడు నెలల క్రితం అప్పటి ఎంపీపీ నాగలక్ష్మీ వ్యక్తిగత కారణాలతో ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. దింతో ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం విడపనకల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి అంజుమన్ సప్రిన్ ఆధ్వర్యంలో తిరిగి ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీ పదవీకి ఎంపీటీసీలందరూ కరణం పుష్పావతి భీమరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపిపిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఛాంబర్ లో ఎంపీడీవో శ్రీనివాసులు సమక్షంలో కరణం పుష్పావతి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నా ఎంపికకు సహకరించిన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వై. విశ్వేశ్వరరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిదంగా అండగా నిలిచిన మండల వైస్సార్సీపీ నాయకులకు, ప్రజాప్రతినిధుకు ధన్యవాదాలు తెలియజేసారు. మండల ప్రజలకు మెరుగైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందే విధంగా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం పలువురు నాయకులు, అభిమానులు పుష్పగుచ్చాలు అందించారు. పూలమాలు, శాలువాలతో అభినందించారు. ఎంపిపి పుష్పావతి- భీమరెడ్డి దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.