కర్ణాటక ప్రభుత్వం ఎత్తిన హోళే ప్రాజెక్ట్ చేపట్టిన విషయం తెలిసిందే. ప్యాకేజీ పైప్ లైన్ పనులు తుమకూరు నుంచి పావగడ వరకు 120 కిలోమీటర్ల మేర జరుగుతున్నాయి. రెండో ప్యాకేజీ పనులు మడకశిర మండలం పాపసానివారి పల్లె నుంచి జరగాల్సి ఉంది. పంట పొలాల్లో పైప్ లైను వెళ్లాల్సి ఉంది. దీంతో రైతులు తమ పంటకు నష్టం కలుగుతుందని ప్యాకేజీ పనులను అడ్డగించారు. జిల్లా సబ్ కలెక్టర్ కార్తీక్ రైతుల వద్దకు చేరుకొని వారితో చర్చలు జరిపారు. ప్రభుత్వం తరపున నుంచి నష్ట పరిహారం అందించేందుకు ప్రయత్నిస్తామని వారికి నచ్చజెప్పారు.