కంబదూరు మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా వున్న సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు, నాయకులుతో నిర్వహించిన "గృహసారథుల శిక్షణ"కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ పాల్గొని మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంపై గృహసారథులకు, సచివాలయ కన్వీనర్లకు దిశ నిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ప్రజలకు మరింత చేరువై వారి మద్దతుతో 2024 ఎన్నికల్లో మళ్ళీ జగనన్నను సీఎం చేద్దాం అన్నారు. టీడీపీ పార్టీకి గృహసారథులు ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈనాడు అయితే మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గృహసారథులు అన్నారు.