రాష్ట్ర ప్రభుత్వం మొండిగా అనుసరిం చాలని చూస్తున్న జిపిఎస్ విధానాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని యూటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు రామప్ప చౌదరి అన్నారు. శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని సరోజినీ నాయుడు పురపాలక బాలికల ఉన్నత పాఠశా లలో యూటీఎఫ్ పట్టణ శాఖ సమావేశాన్ని పట్టణ అధ్యక్షుడు రాజకుమార్ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సమావేశానికి ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామప్ప చౌదరి, కోశాధికారి రాఘవేంద్ర హాజరయ్యా రు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం గతం లో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధా నాన్ని రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని వెంటనే అమలుచేయాలన్నారు. అలా కాకుండా జిపిఎస్ విధానాన్ని అమలు చేయాలని చూస్తే రాష్ట్రవ్యా ప్తంగా ఉద్యమాలు చేయడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు సంఘటి తం కావాలన్నారు. ఇందులో భాగం గానే ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని ధర్మస్థలిలో సంకల్ప దీక్ష సభను ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. ఐతే ప్రభుత్వం ఆ సభను కూడా అడ్డుకొని సభ నిర్వహించకుండా పోలీసులతో అరెస్టులు చేయడం జరిగింద న్నారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గుంతకల్లు పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలుగా రాజ్ కుమార్, శంకరయ్య, గౌరవాధ్యక్షులుగా మల్లికార్జున, కోశాధికారిగాఎల్లన్న, ఉపాధ్యక్షులు విశాలాక్షి, రఫీలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో యూటీఫ్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.