రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీలలో పేదలకు అందిస్తున్న రూ 1. 80 లక్షలు ఏమాత్రం సరిపోవని పేదల సొంతింటి కల నెరవేరాలంటే ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు దేవరగుడి జగదీష్, ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని బిటి. పక్కీరప్ప ఫంక్షన్ హాలులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి. జగదీష్ ఆధ్వర్యంలో సొంత ఇల్లు కోసం లబ్ధి దారుల ఘోషపై అనే అంశంపై అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ నియోజ వర్గం కార్యదర్శి వీరభద్రస్వామి అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమా వేశంలో సీపీఐ నియోజికవర్గం సహాయ కార్యదర్శి బి. మహేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్, టిడిపి జిల్లా నాయకులు కెసి. హరి కుమార్, వెంకట శివుడు, హిమబిందు, కాంగ్రెస్ పార్టి నియోజకవర్గ ఇంఛార్జి దౌల్తాపురం ప్రభాకర్, బిఎస్పి జిల్లా నాయకులు శ్రీనివాస రాజు, జైభీమ్ పార్టి నాయకురాలు గౌసియా, ఎంఆర్పిఎస్ నాయకులు వి. ఆనంద్, సంచార జాతుల రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి పిసి. కుల్లాయప్ప పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ఇంటికి 1, 80, 000 ఏమాత్రం సరిపోదని 5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అన్నారు. అదేవిధంగా టిడ్కో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాల న్నారు. ఇంకా ఇంటి స్థలం లేని నిరుపేదలకు 90 రోజుల్లో స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో సిపిఐ జిల్లా నాయకులు అబ్దుల్ వహాబ్ , సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి. గౌస్ , సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐటీయూసీ మండల కార్యదర్శి ఈశ్వరయ్య, మహిళా సమైక్య నియోజకవర్గం కార్యదర్శి రామాం జనమ్మ తదితరులు పాల్గొన్నారు.