సర్వేపల్లి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ మరియు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన క్లస్టర్, యూనిట్, బూత్ లెవెల్ కమిటీల సమావేశం నెల్లూరు టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గం టిడిపి పరిశీలకులు మరియు కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం హాజరై మాట్లాడుతూ. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు మరియు ప్రతి కార్యకర్త ఒక పసుపు సైనికుడిలా పనిచేయాలని, అలాగే ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. 2024 లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.