తర్లుపాడు మండలం మీర్జెపేట గ్రామం లో గ్రామీణ పశువైద్యశాలలో మార్కాపురం డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ పి. వెంకట సుబ్బయ్య శుక్రవారం రికార్డులను పరిశీలించారు. అనంతరం మందుల స్టాక్ ను పరిశీలించారు. అనంతరం ఎబిహెచ్ ద్వారా వైయస్ ఆర్ పశుసంచాలక వాహనం 1962 ద్వారా మనుషులకు అత్యవసర ఆరోగ్య సేవలు కోసం 108 లాగా పశువులకు 1962 ద్వారా వాహనపు అత్యవసర సేవలు అందించటం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం రికార్డు లను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సిహేచ్ రమేష్, ఆఫీస్ సభార్డినేట్ శ్యామ్ పాల్గొన్నారు.