పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడికో శిక్షణను పునః ప్రారంభించాలని చీరాల డివిజన్ మెడికల్ ఫస్ట్ ఎయిడర్స్ సంక్షేమ సంఘం కోశాధికారి పచ్చవ రమేష్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డాక్టర్ వైయస్ రాజశేఖర లరెడ్డి హయాంలో ఈ శిక్షణ ఇవ్వగా తామంతా పొందామని, ఆ తరువాత ఆ కార్యక్రమం నిలిచిపోయిందని ఆయన చెప్పారు. వెంటనే ఆ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనిని ఆయన కోరారు. వేటపాలెంలో శుక్రవారం చీరాల డివిజన్ మెడికల్ ఫస్ట్ ఎయిడర్స్ సంక్షేమ సంఘం కార్యవర్గ ఎన్నికలు జరుగగా అధ్యక్ష, కార్యదర్శులుగా కాటూరి వరప్రసాద్, ఎన్ సుధాకర్, కోశాధికారిగా రమేష్ బాబులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.