కందుకూరు ఆర్టీసీ డిపో వద్ద ఎస్ డబ్ల్యూ ఎఫ్ డిపో కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమం డిపో అధ్యక్షులు కడిమాల ప్రవీణ్ అధ్యక్షతన జరిగింది. డిపో కార్యదర్శి దాసం రమణయ్య మాట్లాడుతూ. ఓటి అయినా చెల్లించాలి, డ్యూటీలు అయినా మార్చాలన్నారు. జీవో నెంబర్ వన్ బై 2019ని కొనసాగించాలన్నారు. ఓవర్ టైం చెల్లింపులు అలవెన్సులు రోజువారీ బస్సు ఆదాయం నుంచి నేరుగా చెల్లించాలని తెలిపారు. పనిష్మెంట్లు ఇచ్చే చర్యలను విరమించాలని, డిపో పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిఎంకి వినతి పత్రాన్ని అందించారు.