భీకరమైన అణ్వాయుధాల శక్తితో అమెరికాను ఎదుర్కొంటామని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా చేస్తున్న సైనిక విన్యాసాలు హద్దు మీరాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. సియోల్లో పర్యటించిన అమెరికా రక్షణశాఖ మంత్రి దక్షిణ కొరియా భద్రతకు యుద్ధవిమానాలు సహా అత్యాధునిక ఆయుధాలు అందిస్తామని ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగానే ఉత్తర కొరియా అణు హెచ్చరికలు చేసింది.