వీధిలో నగ్నంగా నడవడాన్ని స్పానిష్ కోర్టు సమర్థించింది.1988 నుండి స్పెయిన్లో బహిరంగ నగ్నత్వం చట్టబద్ధమైంది. అయితే స్పెయిన్లో వాలెన్సియా వీధుల గుండా నగ్నంగా నడిచి జరిమానాకు గురైన అలెజాండ్రో కొలోమర్కి స్పెయిన్ హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. అతను వీధుల్లో అలా నడవటం పౌరుల భద్రత, ప్రశాంతతకు భంగం కలిగించలేదని వాలెన్సియా న్యాయస్థానం పేర్కొంది. అది వారి హక్కు అని స్పష్టం చేసింది.