వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. అనేక వ్యాయామాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ పురుషులు, మహిళలకు ప్రత్యేక వ్యాయామాలు ఉన్నాయి. డెడ్ లిఫ్ట్ అనేది పురుషులకు చాలా ముఖ్యమైన వ్యాయామం. దీనివల్ల కండరాలు బలంగా మారి రక్తంలో టెస్టోస్టెరాన్ పరిమాణం కూడా పెరుగుతుంది. బ్యాక్ స్క్వాట్, బెంచ్ ప్రెస్ వ్యాయామాలు కూడా చాలా ముఖ్యం. ఛాతీ వెడల్పుతో పాటు చేతుల కండరాలు కూడా బలంగా మారుతాయి.