ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధిక లాభాలతో దుమ్మురేపింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రూ.15,477 కోట్ల నికర లాభం వచ్చినట్లు ఎస్బీఐ ప్రకటించింది. 2021-22 సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి రూ.9,555 కోట్లు రాగా, ఈ సారి 65 శాతం అధిక లాభాలు రావడం విశేషం. రోడ్లు, పోర్టులు, కన్స్యూమర్ గూడ్స్ రంగాలు సానుకూలంగా ఉన్నాయని, మరింత వృద్ధి సాధిస్తామని ఎస్బీఐ తెలిపింది.