అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌కు రిపబ్లికన్లు షాకిచ్చారు. అత్యంత శక్తిమంతమైన హౌస్ ‘ఫారెన్ అఫైర్స్ కమిటీ’ నుంచి తొలగించారు. ఆమె 2019లో ఇజ్రాయెల్, యూదులకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనల చూస్తే కమిటీలో ఉండటానికి అర్హురాలు కాదని రిపబ్లికన్ పార్టీ సభ్యులు వాదించారు. కాగా, గతేడాది ఇల్హాన్ ఒమర్ భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతినేలా ప్రవర్తించేలా వ్యాఖ్యలు చేశారు.