శీతాకాలంలో ప్రజలు సాధారణ రోజుల కంటే ఎక్కువ సేపు నిద్రపోతుంటారు. ప్రొద్దుటే లేవాలంటే బద్ధకిస్తారు. నిద్ర నుంచి మేల్కొనేందుకు అంతగా ఇష్టపడరు. దీనికి కొన్ని కారణాలున్నాయి. శీతాకాలంలో చాలా మందికి ఎందుకు ఎక్కువ నిద్ర వస్తుందో తెలుసుకుందాం.
శరీరానికి అవసరమైన విటమిన్-డి లభించకపోతే అలసట వస్తుంది. ఈ కారణం వల్ల బద్ధకం, సోమరితనం ఆవహిస్తాయి. ఎవరైనా సూర్యరశ్మి తగలకుండా ఇంట్లోనే ఉంటుంటే, శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి నివారించేందుకు ఎండలోకి రావడం మంచిది. శరీరానికి అవసరమైన విటమిన్-డి పుష్కలంగా తీసుకోవాలి.
తీసుకునే ఆహారం కూడా శీతాకాలంలో ఎక్కువ సేపు నిద్రపోవడానికి కారణం అవుతుంది. ఎక్కువ వేయించిన, కాల్చిన ఆహారం, ఎక్కువ మసాలా ఆహారం తిన్నప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది.
ఎక్కువ జిడ్డు ఉన్న ఆహారం తిన్నప్పుడు శీతాకాలంలో ఒక వ్యక్తి ఇంకా ఎక్కువ నిద్రపోవడానికి అవకాశం ఉంది. జిడ్డుగల ఆహారాన్ని నివారిస్తే, అతి నిద్ర సమస్యను నివారించవచ్చు.
దీంతో పాటు శీతాకాలంలో మెలటోనిన్ అనే హార్మోన్ వ్యక్తి శరీరంలో విడుదలవుతుంది. దాని స్థాయి పెరిగితే ఎక్కువ నిద్రకు కారణం అవుతుంది. దీన్ని నియంత్రిస్తే అతినిద్ర సమస్యకు పరిష్కారం లభిస్తుంది.