కందుకూరు పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కందుకూరు పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా మున్సిపాలిటీకి ఆదాయ వనరలను పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అన్నారు. విజయవాడ సిటీ కార్పొరేషన్ కు సమానంగా కందుకూరు మున్సిపాలిటీ విస్తీర్ణం ఉందన్నారు.