దేశంలో తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులుగా మారనున్నారు. కేరళకు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్జెండర్ జంట మరో నెలలో బిడ్డకు జన్మనివ్వనుంది. ‘తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనునున్నాయి.’ అని అమ్మాయిలా మారిన జియా పావెల్ ఇన్స్టాలో రాసుకొచ్చింది. సంతానం కోసం.. అబ్బాయిగా మారే చికిత్సను జహాద్ వాయిదా వేసుకున్నారు.