పాకిస్థాన్లో ఓ యువతి వీరంగం సృష్టించింది. కరాచీలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న కారును ఓ పోలీసు అధికారిపై ఆపారు. దీంతో ఆగ్రహించిన మహిళ ఆయనపై చేయిచేసుకుంది. ఆయన చెప్పేది వినకుండా మీదకి దూసుకెళ్తూ అతని చెంప పగులగొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది. కాగా ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.